గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రిని 3 రోజుల్లో పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-04-08T09:01:42+05:30 IST

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రి ఏర్పాటు పనులను వేగవంతం చేసి రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ అధికారులను...

గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రిని 3 రోజుల్లో పూర్తి చేయండి

  • అధికారులను ఆదేశించిన కేటీఆర్‌, ఈటల


గచ్చిబౌలి/మొయినాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రి ఏర్పాటు పనులను వేగవంతం చేసి రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిని వారు సందర్శించారు. పనులను పర్యవేక్షించారు. స్టేడియంలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 1200 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 15 రోజులుగా ఆస్పత్రి పనులు ముమ్మరం చేశామన్నారు.


మరోవైపు.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర ఆస్పత్రిని మంత్రులు కేటీఆర్‌, ఈటల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐసీయూలోని వార్డులు, పడకలను పరిశీలించారు. పాజిటివ్‌ కేసులు పెరిగితే చికిత్స అందించేందుకు భాస్కర ఆస్పత్రిని ఐసోలేషన్‌ కేంద్రంగా సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 22 ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. వారి వెంట డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, అధికారులు ఉన్నారు. 


Updated Date - 2020-04-08T09:01:42+05:30 IST