భద్రాద్రి ఎస్పీపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-06-23T02:15:14+05:30 IST

సివిల్‌ వివాదంలో తలదూర్చి తనను భదాద్రి-కొత్తగూడెం ఎస్పీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. పాల్వంచ ఎస్సైతో కలిసి తన 5 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు

భద్రాద్రి ఎస్పీపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్: సివిల్‌ వివాదంలో తలదూర్చి తనను భదాద్రి-కొత్తగూడెం ఎస్పీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. పాల్వంచ ఎస్సైతో కలిసి తన 5 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి పిలిపించి ఎస్పీ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై హెచ్‌ఆర్సీ తీవ్రంగా స్పందించింది. సివిల్‌ వివాదంలో ఎస్పీ తలదూర్చిన ఘటనపై ఒక ఆర్డీవో ర్యాంకు స్థాయి అధికారితో విచారణ జరిపించాలని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ సంఘటనపై సమగ్ర  నివేదికను జూలై 31న తమకు సమర్పించాలని నిర్ధేశించింది. 


Updated Date - 2020-06-23T02:15:14+05:30 IST