పరిహారమిచ్చి ఆదుకోవాలి: తమ్మినేని
ABN , First Publish Date - 2020-04-12T09:05:44+05:30 IST
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37 వేల ఎకరాల్లో పంట నష్టం

హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరాకు రూ. 20 వేల చొప్పున సాయాన్ని అందించాలని విన్నవించారు.