శ్రీశైలం మృతుల కుటుంబాలకు రూ.75 లక్షల చొప్పున పరిహారం
ABN , First Publish Date - 2020-09-12T08:07:54+05:30 IST
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన జెన్‌కో ఉద్యోగుల

జెన్‌కో ఉద్యోగులకు మాత్రమే పరిహారం, ఉద్యోగం
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన జెన్‌కో ఉద్యోగుల ఒక్కో కుటుంబానికి రూ.75 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగాలు ఇవ్వాలని జెన్‌కో నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ప్రమాదంలో మరణించిన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల విషయమై జెన్‌కో నిర్ణయం తీసుకోలేదు. ప్రమాదాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీశైలం ప్రమాదంపై నివేదికలు సిద్ధం
శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎ్‌ఫఎ్‌సఎల్), అగ్నిమాపక శాఖ ప్రాథమిక నివేదికలు సిద్ధమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఐడీ ప్రత్యేక నిపుణుల బృందం ప్రమాద స్థలాన్ని పలు మార్లు సందర్శించింది.
కాలిపోయిన వైర్లతోపాటు పవర్ సరఫరాకి ఉపయోగించిన వైర్లు, బ్యాటరీలు, ఇతర ఆధారాలను ేసకరించి, విశ్లేషించి ఫోరెన్సిక్ బృందం ప్రాథమిక నివేదికను అధికారులకు అందజేసింది. అగ్నిమాపక శాఖ నుంచి కూడా అధికారులు నివేదిక ేసకరించారు.