కరోనా వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం కమిటీ

ABN , First Publish Date - 2020-04-02T01:55:35+05:30 IST

కరోనా వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. జోనల్ కమిషనర్ రవి కిరణ్ నేతృత్వంలో 8 మంది అధికారులతో కమిటీని నియమించారు.

కరోనా వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం కమిటీ

హైదరాబాద్‌: కరోనా వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. జోనల్ కమిషనర్ రవి కిరణ్ నేతృత్వంలో 8 మంది అధికారులతో కమిటీని నియమించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మనిషి బతికున్నన్నాళ్లు ఎలా ఉన్నా... చనిపోయిన తర్వాత మాత్రం అతడి ఆఖరి పయనంలో అయినవాళ్లు, బంధువులు, గ్రామస్థులు పాలు పంచుకుంటారు. అయితే కరోనా వైరస్ మృతులు మాత్రం.. అంత్యక్రియల్లోనూ ఒంటరిగానే మజిలీకి చేరుతున్నారు. తోడు వచ్చే ఆ నలుగురూ లేకుండానే వారి కర్మకాండలు జరిగిపోతున్నాయి. వైరస్ తమక్కెక్కడ సోకుతుందోనన్న భయంతో బంధువులు కూడా ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Updated Date - 2020-04-02T01:55:35+05:30 IST