మనీలెండర్స్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-05-29T23:31:21+05:30 IST
తెలంగాణ మనీలెండర్స్ చట్టం-1349ఎఫ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రుణవిముక్తి కమిషన్ (తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ డెబిట్ రీలీఫ్) ఛైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు లేఖ ద్వారా జిల్లా కలెక్టను

హైదరాబాద్: తెలంగాణ మనీలెండర్స్ చట్టం-1349ఎఫ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రుణవిముక్తి కమిషన్ (తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ డెబిట్ రీలీఫ్) ఛైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు లేఖ ద్వారా జిల్లా కలెక్టను కోరారు. రాష్ట్రంలో సన్నకారు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ చేతి వృత్తుల వారిని ప్రైవేట్ రుణదాతలు, పాన్ బ్రోకర్స్ వేధింపుల నుంచి రక్షించడానికి అన్నిజిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ మనీలెండర్స్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు.