కల్నల్ సంతోష్ కుటుంబానికి కేంద్రం అండగా ఉంటుంది: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-22T00:17:19+05:30 IST

కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సంతోష్ సేవలను ఆయన కొనియాడారు. సంతోష్, తల్లిదండ్రులను, భార్యను కిషన్‌రెడ్డి ఓదార్చారు

కల్నల్ సంతోష్ కుటుంబానికి  కేంద్రం అండగా ఉంటుంది: కిషన్‌రెడ్డి

సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సంతోష్ సేవలను ఆయన కొనియాడారు. ప్రధాని మోడీ ఆదేశాలతో కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించానని ఆయన చెప్పారు. కల్నల్ సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికి కాకుండా దేశానికి , సైన్యానికి తీరని నష్టమన్నారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరు సంతోష్ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు. సంప్రదింపులు జరుపుతూనే చైనా దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. సమస్య పరిష్కారం కోసం ఎలా వ్యవహరించాలని అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామని, ఇతర దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రతీకార జ్వాలతో ఉన్న ప్రజల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరుగుతుందని, చైనా వస్తువులను వాడకుండా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2020-06-22T00:17:19+05:30 IST