కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు కేసీఆర్‌ పరామర్శ

ABN , First Publish Date - 2020-06-22T21:31:31+05:30 IST

కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.5 కోట్ల చెక్కు, నివాస స్థలపత్రాలు కేసీఆర్‌ అందజేశారు. రూ.4కోట్ల రూపాయల చెక్‌ను సంతోష్ బాబు భార్యకు..

కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు కేసీఆర్‌ పరామర్శ

సూర్యాపేట: కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.5 కోట్ల చెక్కు, నివాస స్థలపత్రాలు కేసీఆర్‌ అందజేశారు. రూ.4కోట్ల రూపాయల చెక్‌ను సంతోష్ బాబు భార్యకు.. రూ.కోటి చెక్‌ను సంతోష్ బాబు తల్లిదండ్రులకు అందజేశారు. కల్నల్‌ కుటుంబానికి జూబ్లిహిల్స్‌లో 711 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. సంతోష్‌ భార్యకు గ్రూప్‌-1 ఉద్యోగ నియామక పత్రాన్ని కేసీఆర్ అందజేశారు. సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి కేసీఆర్ నివాళులు అర్పించారు. సీఎంతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, అధికారులు సూర్యాపేటకు వెళ్లారు.

Updated Date - 2020-06-22T21:31:31+05:30 IST