గర్భిణి అవస్థపై స్పందించిన కలెక్టర్
ABN , First Publish Date - 2020-04-25T08:34:51+05:30 IST
గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిలో ఎక్కువ మంది క్వారంటైన్‌లో ఉండటంతో నిండు గర్భణికి వైద్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

గద్వాల నుంచి మహబూబ్‌నగర్‌కు అంబులెన్స్‌లో తరలింపు
గద్వాల క్రైం, అయిజ, ఏప్రిల్ 24: గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిలో ఎక్కువ మంది క్వారంటైన్‌లో ఉండటంతో నిండు గర్భణికి వైద్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయిజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన మహేంద్ర నెలలు నిండిన తన భార్య జెనీలను శుక్రవారం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ బ్లడ్ బ్యాంక్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో సిబ్బంది మొత్తం, నలుగురు డాక్టర్లు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో జనీల ఆస్పత్రి ఆవరణలో బెంచ్‌పై పడుకోగా.. ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కలెక్టర్ శ్రుతి ఓఝా దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. వారు అంబులెన్స్‌ను రప్పించి గర్భిణిని మహబూబ్‌నగర్‌కు తరలించారు.