కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు కోపం వచ్చింది..

ABN , First Publish Date - 2020-03-24T11:24:48+05:30 IST

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ రోడ్లపై ఎక్కువగా కనిపించడం, బైక్‌లు, కార్లలో వెళ్లడం, గుమిగూడి ఉండడం వంటి పరిణామాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు ఆగ్రహం

కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు కోపం వచ్చింది..

 సిరిసిల్ల: లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ  రోడ్లపై ఎక్కువగా కనిపించడం, బైక్‌లు, కార్లలో వెళ్లడం, గుమిగూడి ఉండడం వంటి పరిణామాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు ఆగ్రహం తెప్పించాయి. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రహదారి వెంట స్వయంగా తిరుగుతూ వాహనాలను ఆపారు. లాక్‌డౌన్‌ ప్రకటించినా బాధ్యత లేకుండా రోడ్లపైకి రావడం ఏమిటని ప్రశ్నించారు. ఆదేశాలు బేఖాతరు చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more