నో కాంప్రమైజ్‌.. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించొద్దు

ABN , First Publish Date - 2020-12-16T05:14:42+05:30 IST

నో కాంప్రమైజ్‌.. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించొద్దు

నో కాంప్రమైజ్‌.. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించొద్దు
ల‌క్ష్మీబ్యారేజీని ప‌రిశీలిస్తున్న ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య‌

 ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

పలిమెల(మహదేవపూర్‌ రూరల్‌), డిసెంబరు 15 : అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. పలిమెల మండలంలో ఆయన మంగళవారం పర్యటించారు. అన్ని  శాఖల అధికారులతో సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్షించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు కార్యదర్శులకు షోకాజు నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిఽధలు కేటాయిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనంతో పాటు సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు, వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలని అన్నారు. రైతు వేదిక నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రైతులు ముందుగానే తూర్పాల(తాలు తొలగించడం) పడుతున్నందున కోత లు లేకుండా ధాన్యాన్ని తూకం వేసి వారికి సహకరించాలన్నారు. లేదంటే సంబంధిత అధికారులు, మిల్లర్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మండలంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా సర్వేయర్లతో కొలతలు తీసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా, పంట కళ్లాల ఏర్పాటుపై అధికారులను అడిగి తెలసుకున్నారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ మంజుల, పంచాయతీరాజ్‌ డీఈ సాయిలు, ఎంపీడీవో, ఎంపీవో, సర్వేయర్‌, పంచాయతీ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

లక్ష్మీ బ్యారేజీ సందర్శన 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీని ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మంగళవారం సందర్శించారు.  బ్యారేజీ వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి పలిమెల ఎస్సైతో చర్చించారు. అనంతరం బ్యారేజీలో నీటి నిల్వ, దిగువకు వదులుతున్న నీటి వివరాలను ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలిమెల, మహదేవపూర్‌ ఎస్సైలు అనిల్‌ కుమార్‌, శ్యాంరాజ్‌, ఆయా శాఖల శాఖ అధికారులు ఉన్నారు.

కాటారం వైటీసీ పరిశీలన

కాటారం :  యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(వైటీసీ)ను వినియోగంలోకి తెచ్చి యువతకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలు అందేలా చర్యలు తీసుకుంటామని  ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. మండల కేంద్రంలో కొన్ని నెలలుగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా మూ తపడి ఉన్న వైటీసీని మంగళవారం ఆయన సందర్శించారు. ’ఉపాధికి ఎసరు’ శీర్షికన ఈనెల 12న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురిత కథనం పై ఆయన స్పందించారు.  న్యాక్‌ ఆధీనంలో ఉన్న వైటీసీలో శిక్షణా కార్యక్రమాలు జరగకపోవడంపై  అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో శిక్షణా కార్యకలాపాలు నిలిచిపోయాయని సెంటర్‌ ఇన్‌చార్జి రమేష్‌ వివరణ ఇచ్చారు. అయితే ఇంత పెద్ద భవన సముదాయాన్ని మెయింటెనెన్స్‌ చేయకపోవడంతో తలుపులు, కిటికీలు చెద లు పడుతున్నాయని, ఆవరణ అంతా పిచ్చి మొక్కలు, పొదలు పెరిగాయని ఇన్‌చార్జి కలెక్టర్‌ అన్నారు. సరైన పర్యవేక్షణ, నిర్వహణ చే యకుంటే ఎందుకు భవనాన్ని తీసుకున్నారని ప్రశ్నించారు. మొదట వైటీసీలో జీపీ పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించాలని ఎంపీడీవో శంకర్‌, తహసీల్దార్‌ సునీతను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడుతూ త్వరలో వైటీసీని వినియోగంలో కి తెచ్చి శిక్షణ కార్యక్రమాలు జరిగేలా చూస్తామన్నారు. 

నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు..

పల్లె ప్రగతి పనులు నత్తనడకన సాగుతున్నాయని, అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తే సహించేది లేదని అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యహెచ్చరించారు. పంచాయ తీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను రైతు వేదికలు, వైకుంఠధామాల పనుల పురోగతిపై ప్రశ్నించా రు. పనులు సాగుతున్నాయని డీఈఈ సాయిలు, ఏఈ అశోక్‌లు తె లుపగా ఇంకెంత కాలం సాగుతాయని, ఇప్పటికే మెమోలు జారీ చే శామని, పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూమి లేకుండా పనులకు ఎక్కడైనా ఆటంకం కలిగిందా? అని తహసీల్దార్‌ సునీతను ప్రశ్నించారు. దామెరకుంటలో స్థలం లేదని, రేగులగూడెంలో ప్రభుత్వ స్థలం సర్వే చేసి అప్పగించిన తర్వాత కొందరు ఆ టంకం కల్గిస్తున్నారని తహసీల్దార్‌ తెలుపగా పనులకు ఆటంకం కల్గించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలన్నారు. దామెరకుంట జీపీలో రూ. 86 లక్షల నిధులు ఉన్నాయని, భూసేకరణ చేసి న భూమి నుంచి ఎకరం స్థలం కేటాయిస్తామని చెప్పినా పనులు ప్రారంభించకపోవడంపైఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెం ట ఎంపీడీవో శంకర్‌, డీఈఈ సాయిలు, ఏఈలు రాజశేఖర్‌, అశోక్‌, ఆర్‌ఐ భాస్కర్‌, కార్యదర్శి సగీర్‌ఖాన్‌, రెవెన్యూ అధికారి బండి శ్రీనివా స్‌ తదితరులు ఉన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి.

Updated Date - 2020-12-16T05:14:42+05:30 IST