రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-21T10:27:31+05:30 IST
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

పరకాలరూరల్, నవంబరు 20: గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిత కోరారు. శుక్రవారం పరకాల మండలం నాగారం, కామారెడ్డిపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు సాగులో మెళకువలు అందించేందుకు, అనుమానాలను నివృత్తి చేసేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పల్లెప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కల్లాల నిర్మాణాలపై రైతులను చైతన్య పరచాలఅన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, డీఈ లింగారెడ్డి, సర్పంచ్‌లు కె.స్రవంతి, రాజయ్య, అధికారులు పాల్గొన్నారు.