డీలర్లు, మిల్లర్ల వద్ద గన్నీ సంచులు సేకరించాలి

ABN , First Publish Date - 2020-04-08T08:47:04+05:30 IST

రేషన్‌ డీలర్లు, రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్న పాత గన్నీ సంచులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులను పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించారు. గన్నీ సంచుల కొరతపై పౌరసరఫరాల భవన్‌లో శ్రీనివాస్‌ రెడ్డి ...

డీలర్లు, మిల్లర్ల వద్ద గన్నీ సంచులు సేకరించాలి

  • ‘రేషన్‌’ గన్నీ సంచి ధర రూ.2 పెంపు: శ్రీనివాస్‌ రెడ్డి


రేషన్‌ డీలర్లు, రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్న పాత గన్నీ సంచులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులను పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించారు. గన్నీ సంచుల కొరతపై పౌరసరఫరాల భవన్‌లో శ్రీనివాస్‌ రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది రబీలో ధాన్యం సేకరణకు పౌరసరఫరాల సంస్థకు 20 కోట్ల గన్నీ సంచులు అవసరమన్నారు. లాక్‌డౌన్‌ వల్ల పశ్చిమ బంగాల్‌ నుంచి కొత్త గన్నీ సంచులు రాలేదని, పాత గన్నీ సంచుల రవాణాకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో కొరత ఏర్పడిందన్నారు. రూ.25 వేల కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, రవాణా కాంట్రాక్టర్లు, గన్నీ సప్లయిర్స్‌, రేషన్‌ డీలర్లకు తక్షణమే చెల్లించాలని సూచించారు. రేషన్‌ డీలర్ల నుంచి తీసుకొనే గన్నీ సంచి ధరను రూ.16 నుంచి రూ.18కి పెంచినట్లు తెలిపారు.  


Updated Date - 2020-04-08T08:47:04+05:30 IST