మీ-సేవ ద్వారా సీఎంఆర్‌ఎఫ్ విరాళాలు
ABN , First Publish Date - 2020-04-01T08:50:47+05:30 IST
సీఎం సహాయ నిధికి విరాళాలను ఆన్‌లైన్ ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన లింకును మీ-సేవ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పేరు,

హైదరాబాద్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): సీఎం సహాయ నిధికి విరాళాలను ఆన్‌లైన్ ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన లింకును మీ-సేవ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పేరు, మొబైల్ నంబర్, ఇతర వివరాలు నమోదుచేసి విరాళం ఇచ్చేందుకు వీలుగా పేమెంట్ గేట్‌వేను సైట్‌లో పొందుపరిచారు. విదేశాల్లో ఉండే వాళ్లు కూడా విరాళాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, చెక్కుల రూపంలోనూ విరాళాలు ఇవ్వొచ్చు. సెక్రటేరియట్‌లోని ఎస్బీఐలో సీఎంఆర్‌ఎఫ్ పేరిట ఉన్న ఖాతాకు విరాళాలు పంపించవచ్చు.
సీఎంఆర్‌ఎఫ్ ఖాతా వివరాలు
అకౌంట్ నంబర్ : 62354157651
ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ : ఎస్‌బీఐఎన్0020077
కరెంట్ అకౌంట్, ఎస్బీఐ, సెక్రటేరియట్ బ్రాంచ్.