సినీ పరిశ్రమపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

ABN , First Publish Date - 2020-06-04T12:23:31+05:30 IST

సినీ పరిశ్రమపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

సినీ పరిశ్రమపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌   

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి) : ‘‘తెలంగాణను సాధించటంతో పాటు, రాష్టాన్ని అభివృద్థి పదంలో నడిపిస్తున్నారు సీఎం కేసీఆర్‌. అంతే కాదు వినోదాన్ని పంచే చిత్ర పరిశ్రమ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టారు’’ అని తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ అన్నారు. తలసాని ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించారు.  ఇకపై కూడా కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఇలాగే ఆదుకుంటామని ఆయన తెలిపారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘30 ఏళ్లగా తలసానితో పరిశ్రమకు మంచి అనుబంధం ఉంది. చిత్ర పరిశ్రమకు ఆయన ఇచ్చిన మద్దతు మరెవరూ ఇవ్వలేదు. కేసీఆర్‌ ఇప్పటి మా పరిస్థితులను అర్థం చేసుకున్నారు. త్వరలోనే చిత్రీకరణలకు అనుకూలంగా జీవో పాస్‌ చేయనున్నారు’’ అని అన్నారు. నిర్మాత అభిషేక్‌ నామా తదితరులు  పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-04T12:23:31+05:30 IST