నేడే క్రిస్మస్‌..మెదక్‌ సిగ.. ధగధగ!

ABN , First Publish Date - 2020-12-25T07:42:56+05:30 IST

క్రీస్తు జన్మదినం.. క్రైస్తవులకు పర్వదినం. ఏటా సంవత్సరాంతంలో వచ్చే ఈ పర్వదినం.. నూతన సంవత్సర శోభను ముందే తీసుకొస్తుంది

నేడే క్రిస్మస్‌..మెదక్‌ సిగ.. ధగధగ!

సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

వేడుకలకు ముస్తాబైన 

మెదక్‌ కేథడ్రల్‌ చర్చి

క్రిస్‌మస్‌ వేడుకలకు ముస్తాబైన కేథడ్రల్‌ చర్చి 


 మెదక్‌, డిసెంబరు 24: క్రీస్తు జన్మదినం.. క్రైస్తవులకు పర్వదినం. ఏటా సంవత్సరాంతంలో వచ్చే ఈ పర్వదినం.. నూతన సంవత్సర శోభను ముందే తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చర్చిలన్నీ విద్యుద్దీప కాంతులతో ధగధగలాడుతున్నాయి. మెదక్‌ కేథడ్రల్‌ చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి వేడుకలకు ద మోస్ట్‌ రెవరెండ్‌ మోడరేటర్‌ ధర్మరాజ్‌ రెస్లమ్‌ హాజరవుతున్నారు.


శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు చర్చి బిషప్‌ రెవరెండ్‌ సాల్మన్‌రాజ్‌ ప్రసంగంతో వేడుకలు ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌ నియోజకవర్గం సీతాఫల్‌మండి, బౌద్ధనగర్‌ డివిజన్లలోని చర్చిలు మెరిసిపోతున్నాయి. క్రిస్మస్‌ రోజున నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలు తిలకించటానికి ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీనివా్‌సనగర్‌కాలనీలో నైల్‌ మెమోరియల్‌ మేథజిస్ట్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీగా చేశారు.


సీఎం, స్పీకర్‌, ఉత్తమ్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-12-25T07:42:56+05:30 IST