మంత్రి ఎర్రబెల్లిపై సీఎం ఆగ్రహం!
ABN , First Publish Date - 2020-03-08T10:11:31+05:30 IST
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

రాజగోపాల్‌రెడ్డి ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకోవడంపై గుస్సా!
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగిస్తుండగా ఎర్రబెల్లి జోక్యం చేసుకొని మాట్లాడారు. ప్రతిగా ఎర్రబెల్లిపై రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోవడానికి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఒకరు స్పందిస్తే బాగుండేదని పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. లోగడ టీడీపీలో ఉండి, ఇప్పుడు టీఆర్‌ఎ్‌సలో కొనసాగుతూ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి జోక్యం చేసుకోవటం వల్ల రాజగోపాల్‌రెడ్డికి విమర్శించే అవకాశం ఇచ్చినట్లయిందని భావిస్తున్నారు. దీనిపైనే సీఎం కేసీఆర్.. ‘‘మధ్యలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చివర్లో సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది కదా! అనవసరంగా విమర్శలకు తావిచ్చినట్లయింది’’ అని ఎర్రబెల్లిని మందలించినట్లు తెలిసింది.
పంచెకట్టులో మంత్రి నిరంజన్‌రెడ్డి
వ్యవసాయ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు పంచెకట్టులో హాజరయ్యారు. సాధారణంగా ఆయన ప్యాంటు, షర్టు ధరిస్తారు.