సెంట్రల్‌ విస్టా దేశానికే గర్వకారణం

ABN , First Publish Date - 2020-12-10T07:50:34+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బుధవారం

సెంట్రల్‌ విస్టా దేశానికే గర్వకారణం

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ లేఖ


హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బుధవారం ప్రధానికి ఆయన లేఖ రాశారు. సెంట్రల్‌ విస్టా గొప్ప ప్రాజెక్టు అని, దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని అభివర్ణించారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, వలస పాలనకు గుర్తుగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి భవనం నిర్మించాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ‘‘సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు దేశ ఆత్మగౌరవానికి, పునరుజ్జీవనానికి, పటిష్ఠతకు చిహ్నంగా నిలుస్తుంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలి’’ అని సీఎం ఆకాంక్షించారు.

Updated Date - 2020-12-10T07:50:34+05:30 IST