నేడు జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..

ABN , First Publish Date - 2020-10-31T12:34:19+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించిన రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం

నేడు జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించిన రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు జనగామ జిల్లా కొడకండ్ల గ్రామానికి చేరుకుంటారు. 12.10 గంటలకు కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. 12.20 గంటలకు పల్లె ప్రకృతివనాన్ని సీఎం పరిశీలిస్తారు. అనంతరం కొడకండ్ల మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠదామం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలిస్తారు. అటు తరువాత కొడకండ్లలో 5000 మంది రైతులతో నిర్వహించనున్న సభలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు. కాగా, ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.

Read more