LIVE: స్పష్టమైన అవగాహనతోనే సీఏఏకి వ్యతిరేకం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2020-03-16T16:53:45+05:30 IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు ప్రాంభమయ్యాయి. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది.
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు ప్రాంభమయ్యాయి. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే ఆరు రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. సీఏఏపై పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. సీఏఏ బిల్లును పార్లమెంట్‌లో కూడా టీఆర్‌ఎస్ వ్యతిరేకించిందన్నారు. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.