ఈనెల 25న ఆరో విడత హరితహారం ప్రారంభించనున్న కేసీఆర్
ABN , First Publish Date - 2020-06-23T01:23:31+05:30 IST
తెలంగాణలో ఈనెల 25న నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభం కానుంది.

హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 25న నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభం కానుంది. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అదే రోజున మెదక్‌జిల్లా నర్సాపూర్ అడవి పునరుద్దరణ కార్యక్రమంలో భాగంగా మొక్కనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని అన్నిజాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని సీఎం కేసీఆర్‌అధికారులను ఆదేశించారు. జాతీయ, రాష్ట్రరహదారుల వెంట ప్రతి 30 కి.మీ.కు ఒకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలని కోరారు.