పస్తు ఉంటాం కానీ...పంచాయతీలకు నిధులు ఆపం: కేసీఆర్

ABN , First Publish Date - 2020-03-13T17:59:46+05:30 IST

పస్తు ఉంటాం కానీ...పంచాయతీలకు నిధులు ఆపం: కేసీఆర్

పస్తు ఉంటాం కానీ...పంచాయతీలకు నిధులు ఆపం: కేసీఆర్

హైదరాబాద్: పంచాయతీరాజ్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లెప్రగతిపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడుతూ పంచాయతీలకు ప్రతినెలా నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. 3వేలకు పైగా గిరిజన తండాలను పంచాయతీలు చేశామన్నారు. చిన్న గ్రామ పంచాయతీలకూ రేషన్‌ షాపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని గ్రామాలకు ఐదేళ్లకు కలిపి రూ.40లక్షలు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం ఇచ్చే గ్రాంట్‌కు సమానంగా రూ.1,847కోట్లు తామే ఇస్తామని తెలిపారు. అవసరమైతే తాము పస్తు ఉంటాం కానీ...పంచాయతీలకు నిధులు మాత్రం ఆపేది లేదని సీఎం తేల్చిచెప్పారు.


500 కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాలు 899 ఉన్నాయన్నారు. 106 జనాభా ఉన్న గ్రామానికి కూడా ట్రాక్టర్‌ కొనాలని నిర్ణయించామని చెప్పారు. గ్రామాలను మార్చుకోవాలన్న సంకల్పంతో చాలా మంది విరాళాలిచ్చారని,  ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఊళ్లను మారుస్తున్నారని తెలిపారు. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. వాళ్లు ఇచ్చిన డబ్బు కన్నా... స్ఫూర్తి చాలా గొప్పదని కొనియాడారు. విద్యుత్‌ చార్జీలు, ఆస్తి పన్నులను పెంచబోతున్నామని తెలిపారు. గ్రామాల్లో 100శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కలెక్టర్లకే లేఅవుట్‌ అనుమతుల బాధ్యతలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-13T17:59:46+05:30 IST