ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించాలి

ABN , First Publish Date - 2020-07-20T09:29:06+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో భయం పోగొట్టి, భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రుల పర్యటన చేయాలని యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించాలి

  • యువ తెలంగాణ పార్టీ నాయకురాలు రాణి రుద్రమ

హైదరాబాద్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో భయం పోగొట్టి, భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రుల పర్యటన చేయాలని యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న విపత్కర పరిస్థితులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిధులు కేటాయించకపోవడం, సిబ్బందిని నియమించకపోవడం వల్ల ప్రజలు బలికావాల్సి వస్తోందని విమర్శించారు. ఆదివారం ఇక్కడ నాగోల్‌లోని తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో కలిసి వర్చువల్‌ ప్రెస్‌మీట్‌ లో రాణి రుద్రమ రెడ్డి మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో వెంటనే శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-20T09:29:06+05:30 IST