సీఎం కేసీఆర్ యాదవుల్ని తిట్టారు
ABN , First Publish Date - 2020-11-03T07:06:32+05:30 IST
తమకు గొర్రెలు ఇవ్వలేదని ధర్నా చేసిన యాదవులను సీఎం కేసీఆర్ తిట్టారని పీసీసీ మాజీ చీఫ్ వి.హన్మంతరావు ఆరోపించారు.
వీహెచ్
డబ్బు కట్టిన అందరికీ గొర్రెలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): తమకు గొర్రెలు ఇవ్వలేదని ధర్నా చేసిన యాదవులను సీఎం కేసీఆర్ తిట్టారని పీసీసీ మాజీ చీఫ్ వి.హన్మంతరావు ఆరోపించారు. ఇలా అవమానపరిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. గాంధీభవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో 4.22 లక్షల మంది గొర్రెల కాపరులు డబ్బు కట్టినా గొర్రెలు ఇవ్వలేదని తెలిపారు. డబ్బు కట్టిన అందరికీ గొర్రెలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ అధికారులను ముఖ్యమైన పోస్టుల్లో నింపుతున్నారని, ప్రభాకర్‌రావును ఇంటెలిజన్స్ చీఫ్‌గా నియమించడం దారుణమన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీసీలు కేసీఆర్‌కు బుద్ధి చెబితే అన్నీ సక్రమంగా జరుగుతాయన్నారు.