సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

ABN , First Publish Date - 2020-05-18T03:45:47+05:30 IST

సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ...

సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులను నింపాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు. రియల్ టైమ్ డాటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ‘‘ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందికి రావాలి. ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటిపారుదల శాఖను పునర్‌ వ్యవస్థీకరించాలి. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ మాన్యువల్ రూపొందించాలి. కాళేశ్వరం పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరుకు పూర్తి చేసి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలి. నీటిపారుదల శాఖ భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. 


Updated Date - 2020-05-18T03:45:47+05:30 IST