కరోనా ఉధృతి ఎక్కువైతే ఇంటింటికి రేషన్‌: కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-03-21T21:53:46+05:30 IST

కరోనా ఉధృతి ఎక్కువైతే ఇంటింటికి రేషన్‌ పంపే యోచన చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు

కరోనా ఉధృతి ఎక్కువైతే ఇంటింటికి రేషన్‌: కేసీఆర్‌

హైదరాబాద్: కరోనా ఉధృతి ఎక్కువైతే ఇంటింటికి రేషన్‌ పంపే యోచన చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి టెస్టింగ్‌ పరికరాలు, మాస్క్‌లు వచ్చాయని చెప్పారు. సమస్య తీవ్రమైతే మనం ముందుగా వైద్యుల్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు. మోదీ సందేశాన్ని కూడా సోషల్‌ మీడియాలో వక్రీకరిస్తున్నారన్నారు. కొందరు వక్రబుద్ధితో ప్రధానిని కూడా అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్‌ చేయాలని డీజీపీకి చెప్పినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-03-21T21:53:46+05:30 IST