తెలంగాణలో బంద్ ఉండేవి ఇవే: కేసీఆర్

ABN , First Publish Date - 2020-05-19T02:01:58+05:30 IST

లాక్‌డౌన్ వరకూ ఫంక్షన్‌ హాల్స్‌, మాల్స్‌, సినిమా హాళ్లు బంద్‌ ఉంటాయని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పారు. అలాగే సభలు

తెలంగాణలో బంద్ ఉండేవి ఇవే: కేసీఆర్

హైదరాబాద్: లాక్‌డౌన్ వరకూ ఫంక్షన్‌ హాల్స్‌, మాల్స్‌, సినిమా హాళ్లు బంద్‌ ఉంటాయని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పారు. అలాగే సభలు, ర్యాలీలు, సమావేశాలకు కూడా అనుమతి ఇవ్వబోమని వెల్లడించారు. వీటితో పాటు బార్స్‌, పబ్స్‌, క్లబ్స్‌, జిమ్‌లు, స్టేడియాలు, పార్క్‌లు బంద్‌ ఉంటాయన్నారు. అన్ని విద్యాసంస్థలను మూసివేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్‌ ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. షాపుల యజమానులు శానిటైజేషన్‌ చేయించాలని తెలిపారు. ఇక అనవసరంగా ప్రజలు రోడ్లపైకి రావొద్దని కోరారు. మళ్లీ తిరగబడితే  లాక్‌డౌన్‌కు వెళ్లాల్సి వస్తుందని వివరించారు. 65 ఏళ్లు దాటిన వారిని, చిన్నారులను బయటికి రానివ్వొద్దని స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణ పాటిద్దాం.. కరోనా నుంచి కాపాడుకుందాం అని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-05-19T02:01:58+05:30 IST