సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్‌ రామ్‌ కృషి- కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-04-05T19:53:31+05:30 IST

దేశంలో సామాజిక న్యాయ సాధనకు బాబూ జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొనియాడారు.

సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్‌ రామ్‌ కృషి- కేసీఆర్‌

హైదరాబాద్‌: దేశంలో సామాజిక న్యాయ సాధనకు బాబూ జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొనియాడారు. బాబాజగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయంతోనే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధిస్తారని, వారికి ప్రభుత్వం  అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే కాదు, సమాజంలో ఉన్నతస్థానాలను అధిరోహించాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యమని అన్నారు. జగ్జీవన్‌రామ్‌ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ముఖ్యమంత్రి ఆయనకు నివాళులర్పించారు. 

Updated Date - 2020-04-05T19:53:31+05:30 IST