నాయినిని పరామర్శించిన సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2020-10-21T22:32:33+05:30 IST
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వెళ్లారు. మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని ఆయన పరామర్శించారు. నిమోనియాతో బాధపడుతున్న నాయినికి వైద్యులు ఇంటెన్సివ్ కేర్‌లో..

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వెళ్లారు. మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని ఆయన పరామర్శించారు. నిమోనియాతో బాధపడుతున్న నాయినికి వైద్యులు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు. 15 రోజుల క్రితం నాయినికి కరోనా పాజిటివ్ వచ్చింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆయనకు నెగెటివ్ వచ్చింది. దీంతో కుదుటపడుతున్న ఆయనకు తిరిగి నిమోనియా సోకింది. శ్వాససంబంధ సమస్యలు తలెత్తడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే నాయిని నరసింహారెడ్డిని పలువురు టీఆర్ఎస్ నేతలు పరామర్శించారు.