ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2020-11-15T20:53:07+05:30 IST

ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమక్ష నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ

ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లు చేస్తామని ప్రకటించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ప్రజాదరణ పొందిందని చెప్పారు. భూరిజిస్ట్రేషన్ ప్రక్రియలో చారిత్రక శకం ఆరంభమైనట్టు ప్రజలు భావిస్తున్నారని, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని తెలిపారు. మరో నాలుగు రోజుల్లో అన్ని రకాల సమస్యలను అధిగమించనుందన్నారు. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులను అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ను సీఎస్‌ సోమేష్‌ కుమార్ ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-11-15T20:53:07+05:30 IST