ప్రగతి భవన్‌లో మువ్వన్నెల ప్రభ

ABN , First Publish Date - 2020-08-16T09:24:31+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా శనివారం స్వాతంత్య్ర దిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో..

ప్రగతి భవన్‌లో మువ్వన్నెల ప్రభ

  • జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి 
  • రాష్ట్రంలో నిరాడంబరంగా వేడుకలు
  • వైద్య సిబ్బందిని గౌరవించండి: కేటీఆర్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రవ్యాప్తంగా శనివారం స్వాతంత్య్ర దిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందుపరేడ్‌ గ్రౌండ్‌లోని అమరుల స్థూపానికి నివాళులర్పించారు. గవర్నర్‌ తమిళిసై.. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు సేవలందిస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ నాకు స్ఫూర్తి. వాళ్ల సంకల్ప బలానికి సలామ్‌.. వారికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో కరోనాపై పోరాడాలని టీఆర్‌ఎ్‌సపీపీ నేత కేకే పిలుపునిచ్చారు.


వైద్య సిబ్బంది సేవలు భేష్‌: కేటీఆర్‌

కరోనా తీవ్రత ఉన్నా ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది పని చేస్తున్నారని, వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం, లూ కెఫే ఆధ్వర్యంలో నిర్మించిన మోడ్రన్‌ టాయిలెట్లను ప్రారంభించారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రూ.50 లక్షల విలువైన హోం ఐసోలేషన్‌ కిట్లతోపాటు బాడీ ఫ్రీజర్లను ఆస్పత్రికి అందజేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రితోపాటు 1200 కేంద్రాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, వైద్య సిబ్బంది ఎంతో చక్కగా పని చేస్తున్నారని ప్రశంసించారు.


కరోనా వైరస్‌ సాధారణమైందని, దీని బారిన పడిన వారిలో 99శాతం మంది కోలుకుంటున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో విలయ తాండవం చేసిన కరోనా.. ఇప్పుడు జిల్లాల్లో వ్యాప్తి చెందుతోందన్నారు. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల బాధితులకు అండగా ఉండేలా ‘‘నషా ముక్త్‌ భారత్‌’’ వార్షిక కార్యాచరణ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌లో జెండా ఆవిష్కరణ తర్వాత మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.


ఆరేళ్ల క్రితమే తెలంగాణకు స్వాతంత్య్రం!: తలసాని

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు అవుతున్నా.. తెలంగాణకు మాత్రం ఆరేళ్ల క్రితం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ వ్యాఖ్యానించారు. మెదక్‌ కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి..  ప్రత్యేక రాష్ట్రంలో ఆరేళ్లలో జరిగిందని మంత్రి వెల్లడించారు. వివిధ జిల్లాల్లో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 


గిల్లికజ్జాలు మంచిది కాదు: పోచారం

రాష్ట్రాల మధ్య  ేస్నహపూర్వక సంబంధాలు ఉండాలని, నదీ జలాల విషయంలో రాష్ట్రాల మధ్య గిల్లికజ్జాలు మంచి పరిణామం కాదని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నదీ జలాల్లో రాష్ట్రాల వాటాలను ఇప్పటికే ట్రైబ్యునళ్లు నిర్ణయించాయని, అనవసర తగాదాలకు ఎవరూ వెళ్లొద్దన్నారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలి ఆవరణలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సచివాలయంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జాతాయ పతాకాన్ని ఆవిష్కరించారు. 




ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

రాష్ట్రమంతటా ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తెలంగాణ స్ట్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎ్‌సఐసీ) ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌-2020ని ఏర్పాటు చేసింది.  యువకుల ఆవిష్కరణలను ్ట్ఛ్చఝ్టటజీఛి.ౌటజ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ఎగ్జిబిషన్‌ను శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అన్ని జిల్లాలను నుంచి వినూత్న ఆవిష్కరణలను ఆహ్వానించగా 250కిపైగా ఎంట్రీ లు వచ్చాయని, ఇందులో 65 గుర్తించామని ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు.

Updated Date - 2020-08-16T09:24:31+05:30 IST