మోదీ బొమ్మలు తగలబెట్టడంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-31T21:02:14+05:30 IST

కార్పొరేట్ కంపెనీల కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం వ్యవసాయ బిల్లును

మోదీ బొమ్మలు తగలబెట్టడంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

జనగామ: కార్పొరేట్ కంపెనీల కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం వ్యవసాయ బిల్లును అడ్డగోలుగా పాస్ చేసిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. కేంద్రం తీరు బాగోలేదు కాబట్టే దసరా పండుగ రోజు రావణాసురుడికి బదులు మోదీ బొమ్మలు తగలబెట్టారని పేర్కొన్నారు. మనం కూడా పిడికిలి బిగించాలని రైతులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. 


రాజీనామాకు సిద్ధం..

పెన్షన్ల విషయంలో తాను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. 38 లక్షల 64 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తుంటే.. కేంద్రం కేవలం 7 లక్షల మందికి రూ.200 మాత్రమే ఇస్తోందని వెల్లడించారు. కానీ దుబ్బాకలో బీజేపీ నేతలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


షబ్బీర్‌ అలీది దొంగనాటకం..

కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ తన పొలంలో వరిని కావాలనే కాల్చారని కేసీఆర్ అన్నారు. షబ్బీర్‌ అలీ దొంగనాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచేది లేదు పీకేది లేదని వ్యాఖ్యానించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Read more