డిప్యూటీ కలెక్టర్‌గా కల్నల్‌ సతీమణి

ABN , First Publish Date - 2020-07-23T00:15:19+05:30 IST

ఇటీవల భారత- చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది.

డిప్యూటీ కలెక్టర్‌గా కల్నల్‌ సతీమణి

హైదరాబాద్‌: ఇటీవల భారత- చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం ప్రగతి భవన్‌లో సంతోషికి అందించారు. సంతోషికి హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి,ఉద్యోగంలో కుదురుకునే వరకూ తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపి బగుగుల లింగయ్య , ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లాపరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ దీపికా యుగంధర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారురాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-23T00:15:19+05:30 IST