హరిత తెలంగాణగా మార్చిన ఘనత సీఎందే: ఎస్ఐ రవి

ABN , First Publish Date - 2020-06-25T22:17:51+05:30 IST

హరిత తెలంగాణగా మార్చిన ఘనత సీఎందే: ఎస్ఐ రవి

హరిత తెలంగాణగా మార్చిన ఘనత సీఎందే: ఎస్ఐ రవి

హైదరాబాద్: హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 6వ విడత హరితహారంలో భాగంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ బీటీ నగర్ లోని పీజేఆర్ విగ్రహం వద్ద  పోలీసులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. 


దేశంలోనే హరితహారంలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత హరిత తెలంగాణగా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని బంజారాహిల్స్ ఎస్ఐ రవి అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి నగరాలలో హరితహారం కార్యక్రమం చక్కగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలన్నారు. కరోనా విజృంభిస్తున్న టైంలో పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నారని ఎస్ఐ తెలిపారు. ప్రజలంతా ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు రావాలని, బయటికి వచ్చినప్పుడు మాస్కులు, శానిటైజర్, హ్యాండ్ గ్లౌజ్ లాంటివి ఉపయోగించి తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా బారిన పడకుండా ఉండాలని ఎస్ఐ రవి సూచించారు.


Updated Date - 2020-06-25T22:17:51+05:30 IST