విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2020-05-08T09:13:51+05:30 IST

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి

విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖ ఘటనపై విచారం వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌.. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై మంత్రులు కేటీఆర్‌, హరీ‌ష్‌రావు, ఎర్రబెల్లి, తలసాని, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు, మాజీ ఎంపీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ బాధితులకు అండగా ఉంటామని డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు.


ఉపరాష్ట్రపతి, గవర్నర్‌ దిగ

విశాఖ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సహాయక చర్యలపై పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడానని ట్విటర్‌లో తెలిపారు. విశాఖ ఘటన బాధాకరమని గవర్నర్‌ తమిళసై వ్యాఖ్యానించారు. విశాఖ ఘటన బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీడీపీ టీఎస్‌ అధ్యక్షుడు రమణ, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-08T09:13:51+05:30 IST