ఆడబిడ్డలకు తొబుట్టువు సీఎం
ABN , First Publish Date - 2020-12-16T04:40:28+05:30 IST
ఆడబిడ్డలకు తొబుట్టువు సీఎం

ఎమ్మెల్యే రెడ్యానాయక్
మరిపెడ, డిసెంబరు 15 : ఆడబిడ్డలకు తొబుట్టువు సీఎం కేసీఆర్ అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎ్‌స.రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మరిపెడ, చిన్నగూడురు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాలకు చెందిన 263 మందికి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్‌లు, 700మందికి క్రిస్మస్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ విజయదశమిని పురస్కరించుకుని కోటీ చీరెలకు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా రంజాన్ పర్వదినం, క్రిస్మస్ సందర్భంగా దుస్తులను పంపిణీ చేశామని తెలియజేశారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, ఎంపీపీ గుగులోతు అరుణారాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారదరవీందర్‌నాయక్, మునిసిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూరకుమారి, వైస్ చైర్‌పర్సన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, రేఖ లలితవెంకటేశ్వర్లు, మాచర్ల స్రవంతిభద్రయ్య పాల్గొన్నారు.