యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-09-13T18:01:21+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ...

యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌

యాదాద్రి (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు సీఎం కేసీఆర్‎కు ఘన స్వాగతం పలికారు. యాదాద్రిలో జరిగే పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. బాలాలయంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్. 

సీఎం వెంట మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్, విప్ గొంగిడి సునీత. ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించిన నాటి నుంచి కేసీఆర్‌ యాదాద్రికి రావడం ఇది 13వ సారి. 

Updated Date - 2020-09-13T18:01:21+05:30 IST