సీఎం రావడం ఎంతో ధైర్యాన్నిచ్చింది: సంతోష్‌బాబు తల్లి

ABN , First Publish Date - 2020-06-22T22:49:47+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మమ్మల్ని పరామర్శించడానికి ఇంటికి రావడం..

సీఎం రావడం ఎంతో ధైర్యాన్నిచ్చింది: సంతోష్‌బాబు తల్లి

సూర్యాపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మమ్మల్ని పరామర్శించడానికి ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని సంతోష్‌ బాబు తల్లి అన్నారు. రెండు, మూడు రోజుల క్రితం ప్రకటించిన విధంగా పిల్లలకు రూ. 4 కోట్లు, తల్లిగా తనకు రూ. కోటి ఇచ్చారని చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇచ్చారని, తన కోడలుకు గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇచ్చారని చెప్పారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించారని ఆమె కొనియాడారు. అంతకుముందు ముఖ్యమంత్రి సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సూర్యాపేటకు వెళ్లారు.

Updated Date - 2020-06-22T22:49:47+05:30 IST