రంగయ్య మృతిపై విచారణ చేపట్టాలి: భట్టి

ABN , First Publish Date - 2020-06-04T09:18:59+05:30 IST

పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు రక్షణ కరువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన

రంగయ్య మృతిపై విచారణ చేపట్టాలి: భట్టి

మంథని, జూన్‌ 3: పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు రక్షణ కరువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ కస్టడీలో ఉండి ఆత్మహత్య చేసుకున్న శీలం రంగయ్య కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రంగయ్య మృతి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతి, గవర్నర్‌, మానవ హక్కులు, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

Updated Date - 2020-06-04T09:18:59+05:30 IST