ప్రాజెక్టుల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
ABN , First Publish Date - 2020-10-19T08:49:09+05:30 IST
ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ల పేరుతో పాలకులు రూ. వేల కోట్లు దోచుకుంటున్నారని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని సీఎల్పీ నేత మల్లు

రీడిజైనింగ్ పేరిట వేల కోట్ల దోపిడీ: భట్టి విక్రమార్క
వెల్దండ, అక్టోబరు 18: ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ల పేరుతో పాలకులు రూ. వేల కోట్లు దోచుకుంటున్నారని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు (కేఎల్‌ఐ) పంప్‌హౌ్‌సను సందర్శించేందుకు వెళ్తున్న భట్టి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ వద్ద పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యతోనే కేఎల్‌ఐ పంప్‌హౌ్‌సలో ప్రమాదం జరిగిందన్నారు. రీడిజైనింగ్‌తో ప్రాజెక్టులను లోపభూయిష్టంగా మారుస్తున్నారని మండిపడ్డారు. కేఎల్‌ఐకి ప్రమాదం పొంచి ఉందని గతంలోనే నిపుణుల కమిటీలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు వర్షాలతో అల్లాడుతుంటే సీఎం ఫాంహౌ్‌సకే పరిమితమయ్యారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు.