31 వరకు రాష్ట్ర సరిహద్దులు మూసివేత
ABN , First Publish Date - 2020-03-23T10:40:47+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నెలాఖరు వరకు 65వ నెంబరు జాతీయ రహదారి

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నెలాఖరు వరకు 65వ నెంబరు జాతీయ రహదారి దిగ్బంధం కొనసాగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా కట్టాడికి, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఈనెల 31వరకు లాక్ డౌన్, ప్రత్యేక్ష ఆంక్షలు విధించిన క్రమంలో ఇరు రాష్ట్రాలకు వచ్చేందుకు ఎవరూ ప్రయత్నించవద్దన్నారు.
నిత్యావసర వస్తువులు పాలు, కూరగాయలు, అంబులెన్స్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రత్యేక పరిస్థితిలో మీడియా సిబ్బందిని అనుమతిస్తామని, అదీ ఒక్కరికి మాత్రమేనని తెలిపారు. శుభకార్యాలు, ఇతర పనులు ఉన్నా వాయిదా వేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన సూచించారు.
కోదాడ