రేషన్‌ డీలర్లు, రైస్‌ మిల్లర్లు పౌరసరఫరాల శాఖలో భాగమే- గంగుల

ABN , First Publish Date - 2020-09-16T20:25:22+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నరేషన్‌డీలర్లు, రైస్‌ మిల్లర్లు పౌరసరఫరాలశాఖలో భాగమేనని రైతాంగాన్ని దృష్టిటో పెట్టుకుని సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని పౌరసఫఱాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విజ్ఞప్తి చేశారు.

రేషన్‌ డీలర్లు, రైస్‌ మిల్లర్లు పౌరసరఫరాల శాఖలో భాగమే- గంగుల

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్నరేషన్‌డీలర్లు, రైస్‌ మిల్లర్లు పౌరసరఫరాలశాఖలో భాగమేనని రైతాంగాన్ని దృష్టిటో పెట్టుకుని సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని పౌరసఫఱాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రేషన్‌డీలర్లను కానీ, రైస్‌ మిల్లర్లను కానీ ఇబ్బంది పెట్టబోదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి వారి న్యాయమైన సమస్యలపరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి లేక రైస్‌ ఇండస్ర్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొందని ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో వందల సంఖ్యలో కొత్త రైస్‌ మిల్లులు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. తెలంగాన రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారబోతోందన్నారు. రేషన్‌డీలర్లు, రైస్‌ మిల్లర్లతో సమావేశమైన మంత్రి గంగుల కమలాకర్‌ గత ఏడాది ఏడాది వానాకాలంలో 47.54 లక్షల మెట్రిక్‌టన్నులు, యాసంగిలో 64.50 కలిపి మొత్తం కోటి 12లక్షల మెట్రి టన్నుల ధన్యాన్నికొనుగోలు చేసినట్టు చెప్పారు.


ఈ వానాకాలం సీజన్‌లో 70లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి లేక రైస్‌ ఇండస్ర్టీ గడ్డుపరిస్థితిని ఎర్కొందని, దానికి భిన్నంగా పరిస్థితి మారిందన్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో కొత్త రైస్‌ మిల్లులు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. తెలంగాన రాష్ట్రం దేశానికి ధాన్యాగారంగా మారుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఒక వైపు దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదుగుతుండగా, మరో వైపు కార్మికులకు ఉపాధి కేంద్రంగా మారిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈవానాకాలం సీజన్‌లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగడంతో దేశంలనే  తెలంగాణ మొదటిస్థానంలో ఉంందన్నారు. పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పౌరసరఫరాలశాఖ ధాన్యాన్ని కొనుగోలుకు విస్తృత ఏర్పాట్లుచేస్తోందన్నారు. 


ప్రభుత్వ అవసరాలను గుర్తించి రేషన్‌డీలర్లు తమ దగ్గర ఉన్నగన్నీసంచులను తప్పని సరిగా పౌరసరఫరాల సంస్ధకు విక్రయించాలని ఆదేశించారు. ఒక్క బ్యాగును పౌరసరఫరాల సంస్ధకు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి 15 రూపాయలు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. దీన్ని బాధ్యతగా రేషన్‌డీలర్లు గుర్తించాలన్నారు. ఈ సందర్బంగా పౌరసరఫరాలసంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో రేషన్‌ డీలర్లు ఉచితంగా పంపిణీ చేసిన బియ్యానికి కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కమీషన్‌ ఇచ్చినట్టు తెలిపారు. గన్నీసంచుల విషయంలోనూ రేషన్‌డీలర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-09-16T20:25:22+05:30 IST