ధాన్యం కొనుగోళ్లకు పౌరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-10-31T20:35:08+05:30 IST

తెలంగాణలో వానాకాలం సీజన్‌లో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లుపూర్తిచేసింది

ధాన్యం కొనుగోళ్లకు పౌరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌: తెలంగాణలో వానాకాలం సీజన్‌లో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా  పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లుపూర్తిచేసింది. ఈసారి వానాకాలంలో రైతుల నుంచి భారీగా ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికోసం పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు కలిగే ఇబ్బందులు, సమస్యలపై ఫిర్యాదుచేసేందుకు 1967 నెంబర్‌తో పాటు, 180042500333, 18004254614 టోల్‌ ఫ్రీ నెంబర్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఫిర్యాదులను స్వీకరిస్తారు. ధాన్యం విక్రయంలో ఏదైనా సమస్యలుంటే రైతులు నేరగా ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-31T20:35:08+05:30 IST