పౌరసఫరాలశాఖ శాఖ డీ టీ కి అప్పిరెడ్డి పల్లి అభినందనలు

ABN , First Publish Date - 2020-09-25T00:40:09+05:30 IST

మాచన రఘునందన్.. పౌరసఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ . విధి నిర్వహణలో భాగంగా తన మంచితనం తో యుక్తి తో ఓ ఊరినే మార్చారు. తప్పు చేయము ఆని గ్రామమే ప్రతీన పూనేలా చేశారు.

పౌరసఫరాలశాఖ శాఖ డీ టీ కి అప్పిరెడ్డి పల్లి అభినందనలు

నారాయణపేట: మాచన రఘునందన్.. పౌరసఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ . విధి నిర్వహణలో భాగంగా తన మంచితనం తో యుక్తి తో ఓ ఊరినే మార్చారు. తప్పు చేయము ఆని గ్రామమే  ప్రతీన పూనేలా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణ పేట జిల్లా అప్పిరెడ్డి పల్లి గ్రామం లో బుధవారం ఓ వ్యక్తి వద్ద నుంచి అక్రమ నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, గ్రామ బాధ్యులు పలువురు రేషన్ బియ్యం స్వాధీనం సందర్భంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చారు . పంచనామా ముగించుకొని వెళ్ళే క్రమంలో మాచన రఘునందన్ గ్రామ ప్రజల కు ఒక ప్రత్యేక విఘ్ణప్తి చేశారు.


మీ ఊరి కి మంచి పేరు తేవడం కోసం కృషి చేయాలని హితవు చెప్పారు. ఆ మేరకు గ్రామ ప్రజలు కలసి కట్టుగా ఉండి ప్రభుత్వం ఇస్తున్న చౌక బియ్యం ను ఎవరూ అధిక ధరల కు అమ్మకూడడని, అక్రమాలను ప్రోత్సహించ కూడదని సూచించారు. ఈ మేరకు గ్రామ పెద్దలు ప్రజలను ఒప్పించి, మెప్పించి ఇక మీదట రేషన్ బియ్యం మేము అమ్మం అని ప్రతీణ పూనెలా చేశారు. అంతే కాకుండా ఊరు ఊరంతా రేషన్ బియ్యం ఎవ్వరైనా అమ్ముకుంటే అపరాధ రుసుం విధిస్తామని చాటింపు వేశారు. 


గురువారం నాడు నారాయణ పేట లో విధి నిర్వహణలో ఉన్న రఘునందన్ ను పలువురు అప్పిరెడ్డి పల్లి గ్రామ నాయకులు కలసి, మేము చేయలేని మంచి పని మీరు చేశారు సార్! మీ మేలు మా ఊరు మరవదు అని అభినందించారు. నేరం జరగకుండా నేర నివారణ చర్యలు తీసుకోవాలని చేసిన సూచన సత్ఫలితాన్ని ఇచ్చిందని చెప్పారు. "మీ ఒక్క మాట తో మా ఊరినే ఆలోచింపజేసింది" అని తెలిపారు. 

Updated Date - 2020-09-25T00:40:09+05:30 IST