రేషన్ అక్రమ దందా కు అరదండాలే

ABN , First Publish Date - 2020-11-07T20:20:00+05:30 IST

రేషన్ దుకాణాల నుంచి బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు నిరూపణ ఐతే,

రేషన్ అక్రమ దందా కు అరదండాలే

నారాయణపేట: రేషన్ దుకాణాల నుంచి బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు నిరూపణ ఐతే, ఆ షాపు రద్దు కావడం ఖాయమని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.  చిన్న జట్రం, లక్ష్మీ పూర్ గ్రామాల చౌక దుకాణాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సైతం జనం చైతన్య వంతులై, ప్రతీ విషయం పై దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు.


గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నా క్షణాల్లో సామాజిక మాధ్యమం ద్వారా వ్యాపిస్తుందని ,అందుకే అక్రమాలకు పాల్పడాలన్న ఆలోచనకు కూడా స్వస్తి చెప్పి నీతి గా నిజాయితీగా నడుచుకోవాలని హితవు చెప్పారు. నారాయణ పేట కలెక్టరు ఆదేశాలు, డీ సీ ఎస్ ఓ నిర్దేశాల మేరకు లక్ష్మీ పూర్ గ్రామ చౌక దుకాణాన్ని తనిఖీ చేసినట్లు వివరించారు. గత సెప్టెంబర్ లో ఓవాహనం రేషన్ బియ్యం తరలిస్తు పట్టుబడగా ఆ సరకు లక్ష్మీపుర్ నుంచి సేకరించినట్లు వెల్లడయ్యిందని అందుకే ఆ గ్రామ చౌక దుకానం పై ఫిర్యాదు అందిన దరిమిలా తాను నిజ నిర్ధారణ కోసం తనిఖీ చేశానన్నారు. 


రేషన్ దుకాణాల లో సాంకేతికంగా బయో మెట్రిక్ యంత్రం ద్వారా మాత్రమే ప్రజా పంపిణీ చేపట్టాలని డీలర్లకు సూచించారు. ఇష్టానుసారం నిర్వహిస్తే అవకతవకలు నమోదు అవుతాయని, అక్రమాలకు ఆస్కారం కలిగే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే ప్రజా పంపిణీ నీ ప్రజల ఆమోదం పొందేలా సాఫీగా నిర్వహించాలని నిర్దేశించారు. ఇక మీదట రేషన్ బియ్యం ఎక్కడ పట్టు బడినా కఠిన చర్యలు తప్పవన్నారు.

Updated Date - 2020-11-07T20:20:00+05:30 IST