మిల్లర్లు రైతులను అయోమయానికి గురి చేస్తే ఉపేక్షించేది లేదు

ABN , First Publish Date - 2020-12-18T01:49:36+05:30 IST

ధాన్యం సేకరణ లో మిల్లర్లు రైతులను అయోమయానికి, ఆందోళనకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని పౌరసఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్

మిల్లర్లు రైతులను అయోమయానికి గురి చేస్తే ఉపేక్షించేది లేదు

నారాయణపేట: ధాన్యం సేకరణ లో మిల్లర్లు రైతులను అయోమయానికి, ఆందోళనకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని  పౌరసఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు. గురువారం నాడు ఆయన నారాయణ పేట జిల్లా మక్తల్ సమీపం లోని వడ్వాట్ రైస్ మిల్లును ఓ రైతు ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సంధర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చెందకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందన్నారు.


వడ్ల కొనుగోలు కేంద్రం లోనే ధాన్య నాణ్యత ధృవీకరించి మిల్లు కు తరలిస్తే, స్వీకరిస్తారో లేదో అన్న అనవసర ఆందోళనకు గురవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. ధాన్యం నాణ్యత, తేమ తదితర అంశాలను నిర్ధారణ చేశాకే మిల్లు కు తరలిస్తారని, మళ్లీ మిల్లు వద్ద రైతులకు ఎటువంటి ఉత్కంఠ తలెత్తకుండా ధాన్యాన్ని స్వీకరించాలని  మిల్లర్ కు రఘునందన్  సూచించారు. మిల్లు ఆవరణలో నిల్వ చేసిన వడ్లకు సరైన రక్షణ కల్పించే లా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


Updated Date - 2020-12-18T01:49:36+05:30 IST