అక్టోబరు 4న సివిల్స్‌ ప్రిలిమ్స్‌

ABN , First Publish Date - 2020-06-06T09:14:18+05:30 IST

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ వంటి అత్యున్నత సర్వీసుల్లో ఎంపికకు నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ను అక్టోబరు 4న ..

అక్టోబరు 4న సివిల్స్‌ ప్రిలిమ్స్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 5: ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ వంటి అత్యున్నత సర్వీసుల్లో ఎంపికకు నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ను అక్టోబరు 4న నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్‌ లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డాయి. అలాగే మెయిన్స్‌ పరీక్షలు జనవరి 8 నుంచి ఐదు రోజులు కొనసాగుతాయి. ఆగిపోయిన సివిల్స్‌ 2019 ఇంటర్వ్యూలను జూలై 20 నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. కాగా, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షను ఆగస్టు 9న, కంబైన్డ్‌ జియో-సైంటిస్ట్‌ మెయిన్‌ పరీక్షను ఆగస్టు 8న, కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరీక్షను అక్టోబరు 22న, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పరీక్షను డిసెంబరు 22న నిర్వహిస్తామని యూపీఎస్సీ పేర్కొంది.

Updated Date - 2020-06-06T09:14:18+05:30 IST