చౌటుప్పల్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
ABN , First Publish Date - 2020-03-16T09:57:29+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. భాస్కర్ థియేటర్ సమీపంలోని కార్పొరేషన్
చౌటుప్పల్ రూరల్, మార్చి 15: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. భాస్కర్ థియేటర్ సమీపంలోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఏటీఎం వెనుక భాగంలోని బాక్సులను తొలగించారు. ఎంతకూ లాక్ తెరుచుకోకపోవడంతో వెళ్లిపోయారు. ముగ్గురు దొంగలు బైక్‌పై వచ్చినట్టు సీసీ పుటేజీలో రికార్డయింది.