బోర్డు తిప్పిన చిట్‌ఫండ్స్‌ కంపెనీ

ABN , First Publish Date - 2020-10-03T11:01:34+05:30 IST

హన్మకొండ చౌరస్తాలో ఓ చిట్‌ఫండ్స్‌ కంపెనీ నిర్వాహకుడు రూ.3కోట్లతో ఉడాయించాడు.

బోర్డు తిప్పిన చిట్‌ఫండ్స్‌ కంపెనీ

రూ.3 కోట్లు వసూలు చేసి జాడలేని నిర్వాహకుడు

నెల రోజులుగా కార్యాలయానికి తాళం

హన్మకొండ పీఎ్‌సలో ఫిర్యాదు చేసిన బాధితులు


వరంగల్‌ అర్బన్‌ క్రైం, అక్టోబరు 2: హన్మకొండ చౌరస్తాలో ఓ చిట్‌ఫండ్స్‌ కంపెనీ నిర్వాహకుడు రూ.3కోట్లతో ఉడాయించాడు. దీంతో బాధితులు శుక్రవారం హన్మకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మొలుగూరి సుదర్శన్‌.. రెండేళ్ల కిందట హన్మకొండ చౌరస్తాలో శ్రీగణపతేశ్వర  చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో నెలవారీ చిట్టీలు నడిపించాడు. ఉమ్మడి జిల్లా నుంచి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు రూ.5లక్షలు, రూ.10లక్షలు, రూ.20లక్షల చి ట్టీ గ్రూపుల్లో చేరారు. సభ్యులు ప్రతీనెల క్రమంతప్పకుండా చిట్టీ డబ్బులు చెల్లించారు. చిట్టీ కిస్తీలు పూర్తయిన తర్వాత ఎత్తుకునేవారికి సదరు నిర్వాహకుడు డబ్బులు చె ల్లించకుండా మాయమాటలు చెప్పి మరో చిట్టీలో సభ్యులుగా చేర్పించాడు. కొన్ని నెలలుగా డబ్బులు చెల్లించకుం డా కాలయాపన చేస్తుండడంతో డబ్బుల కోసం నిర్వాహకుడు సుదర్శన్‌ను సభ్యులు నిలదీశారు. దీంతో అతడు బౌ న్సర్లు, రౌడీషీటర్లతో బెదిరించాడని బాధితులు తెలిపారు. 


నెలరోజులుగా ఆఫీసుకు తాళం

నెల రోజులుగా  చిట్‌ఫండ్స్‌ సంస్థ నిర్వాహకుడు, కా ర్యాలయ సిబ్బంది ఫోన్లు పని చేయకపోవడంతో బాధితు లు శుక్రవారం ఆఫీసు వద్దకు చేరుకున్నారు. కార్యాలయానికి తాళం వేయడం, సుదర్శన్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉం డడంతో బాధితులు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుదర్శన్‌ సుమారు వంద మంది నుంచి చిట్టీల ద్వారా జమచేసిన రూ.3కోట్ల డబ్బులతో కనిపించకుండా పోయినట్టు బాధితులు పోలీసులకు వెల్లడించారు. తాము పిల్లల వివాహాలు, చదువులు, ఇళ్ల నిర్మాణం  కోసం డబ్బు లు కూడబెట్టామని, పరారీలో ఉన్న సుదర్శన్‌ను పట్టుకుని తమకు డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు. ఫిర్యాదు చేసినవారిలో 20 మంది సభ్యులు ఉన్నారు.

Updated Date - 2020-10-03T11:01:34+05:30 IST