చిరుత వెళ్లిపోయింది

ABN , First Publish Date - 2020-05-18T09:33:00+05:30 IST

నాలుగు రోజులుగా అధికారులను ముప్పతిప్పలు పెట్టి, ప్రజలను భయాందోళనకు గురిచేసిన చిరుత.. ఎట్టకేలకు తిరిగి తన స్థావరానికి చేరుకుంది. చిరుత అడవిలోకి వెళ్లిపోయిందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అటవీశాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ఇక ఆందోళన

చిరుత వెళ్లిపోయింది

రాజేంద్రనగర్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులుగా అధికారులను ముప్పతిప్పలు పెట్టి, ప్రజలను భయాందోళనకు గురిచేసిన చిరుత.. ఎట్టకేలకు తిరిగి తన స్థావరానికి చేరుకుంది. చిరుత అడవిలోకి వెళ్లిపోయిందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అటవీశాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాకపోతే.. కొంచెం అప్రమత్తంగా ఉండాలని చుట్టుపక్కల గ్రామస్థులకు సూచించారు. శనివారం హిమాయత్‌సాగ్‌ జలాశయం దగ్గర్లోని అజీజ్‌నగర్‌, కవ్వగూడ, నాగిరెడ్డిగూడ ప్రాంతాల్లో చిరుత కనిపించిందని స్థానికులు చెప్పినప్పటికీ.. అధికారులకు ఎలాంటి ఆధారాలూ లభించలేదు. కానీ, ఆ గ్రామస్థులకు మా త్రం కంటిమీద కునుకులేదు. రాజేంద్రనగర్‌లోని వ్యవ సాయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌, నార్మ్‌, మేనెజ్‌ ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు రాత్రిపూట విధులు నిర్వర్తిస్తుంటారు. నాలుగురోజులుగా వీరు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. వీరికి ఆయా సంస్థల అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. పులి అడవిలోకి వెళ్లిపోయినా.. అప్రమత్తంగానే ఉండాలని చెబుతున్నారు. చిరుత కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

యాదాద్రిలో చిరుత కలకలం 

యాదగిరిగుట్టకు ఎదురుగా ఉన్న పెద్దగుట్టపై చిరుత సంచారం ఆదివారం కలకలం సృష్టించింది. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సుచరిత ఆధ్వర్యంలో అటవీ అధికారులు చిరుత కోసం గాలించారు. ఈ ఘటనపై రేంజ్‌ ఆఫీసర్‌ సుచరిత మాట్లాడుతూ.. దేవస్థానానికి ఎదురుగా ఉన్న కొండపై చిరుత సంచరిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

Updated Date - 2020-05-18T09:33:00+05:30 IST